రోజా పాటించడం లేదంటూ ఫైర్
ఉత్తర ప్రదేశ్ – భారత స్టార్ పేసర్ మొహమ్మద్ షమీపై సీరియస్ అయ్యారు మత పెద్దలు. తను రోజాను పాటించడం లేదంటూ మండిపడ్డారు ఆల్ ఇండియా ముస్లిం జమాత్ జాతీయ అధ్యక్షుడు మౌలానా షాహబుద్దీన్ రజ్వీ బరేల్వీ. ఇస్లాం మతంలో రోజా అన్నది అత్యంత పవిత్రమైనదని పేర్కొన్నారు. ఇది ప్రతి ఒక్క పరుషుడు, స్త్రీకి వర్తిస్తుందన్నారు. ఒకవేళ ఎవరైనా ఉద్దేశ పూర్వకంగా ఉపవాసం చేయక పోతే అది పాపం అవుతుందని అన్నారు. షమీ రోజా పాటించక పోవడం దారుణమన్నారు.
గురువారం మౌలానా షాహబుద్దీన్ రజ్వీ బరేల్వీ మీడియాతో మాట్లాడారు. షమీ రోజాను పాటించ లేదని ఆరోపించారరు. అది అతని మతపరమైన విధి అయినప్పటికీ. ఉపవాసం ఉండక పోవడం ద్వారా, అతను షరియా దృష్టిలో తీవ్రమైన నేరం చేశాడని అన్నారు. మతపరమైన పరంగా దోషిగా ఉంటాడని స్పష్టం చేశారు. ఇస్లాం బాధ్యతలను ఖచ్చితంగా పాటించాలని సలహా ఇస్తున్నామని , పాటించక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
రజ్వీ బరేల్వీ చేసిన ప్రకటనపై షమీ బంధువు మహమ్మద్ కైఫ్ స్పందించాడు. నమాజ్ లాగే ప్రతి ముస్లింకు రోజా తప్పనిసరి. అయితే, ఒక వ్యక్తి ప్రయాణిస్తున్నప్పుడు, చాలా మినహాయింపులు ఉన్నాయని తెలిపారు. ఇమామ్ కొన్ని ఇస్లామిక్ పుస్తకాలను చదవాలని సూచించారు. షమీ దేశం కోసం ఆడుతున్నాడు. అభ్యంతరం ఎందుకు చెప్పాలని ప్రశ్నించాడు.