నల్ల కలువ పాటల వెల్లువ
రూ. 25 కోట్ల రెమ్యూనరేషన్ చెల్లించిన అంబానీ
ప్రపంచాన్ని ఉర్రూతలూగించి కోట్లాది గుండెలను మీటే ఆయుధం పాట. దానిని మించినది ఏదీ లేదు. అందుకే దానికంత క్రేజ్. కులం లేదు..మతం లేదు..మనుషులే కాదు జంతువులు సైతం పాటలకు చిందేసిన సందర్భాలు అనేకం. ప్రపంచపు సంగీతపు వేదిక మీద ఎందరో గాయనీ గాయకులు తళుక్కున మెరిశారు. మరికొందరు రాలి పోయారు. కొందరు ప్రజల కోసం తమ గొంతులను అరువు ఇచ్చారు. బతుకంతా మట్టి మనుషుల కోసం గానం చేశారు. అలాంటి వారిలో పాల్ రాబ్సన్, జస్టిస్ బీబర్, ప్రజా యుద్ధ నౌక గద్దర్ , బాబ్ మార్లే ..ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో. పాట జనాన్ని చైతన్యవంతం చేసే దట్టించిన తూటా. అందుకే దానిని చూస్తే జడుసుకుంటారు. తమ వరకు రానంత వరకు లీనమై పోతారు. ఎప్పుడైతే ప్రశ్నించడం మొదలవుతుందో అప్పటి నుంచి పాటపై నిఘా పెడతారు..నిర్బంధపు చర్యలకు శ్రీకారం చుడతారు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. కొందరు గాయకులు కేవలం మానసిక ఆనందాని కలిగించేందుకు మాత్రమే పాడితే మరికొందరు మాత్రం అణిచివేతలను, దోపిడీని ప్రశ్నిస్తారు తమ పాటలతో.
ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం ఒకే ఒక్క గాయకుడు మాత్రం వరల్డ్ వైడ్ గా వైరల్ గా మారాడు. సామాజిక మాధ్యమాలన్నీ అతడి గురించే ప్రస్తావిస్తున్నాయి. అతడి ఫోటోలను కోట్లాది మంది షేర్ చేసుకుంటున్నారు. ఇన్ స్టా అయితే నిండి పోయింది రీల్స్ తో, మ్యూజిక్ వీడియో ఆల్బమ్ లతో. ఇంతకూ అతడు ఎవరో కాదు పట్టుమని 24 ఏళ్లు కూడా నిండని నైజిరియా దేశానికి చెందిన నల్ల జాతి వజ్రం రెమా. తన గానం కోసం భారత దేశ వ్యాపారవేత్త రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ ఏరికోరి తన కొడుకు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ కోసం పిలిపించాడు. ప్రత్యేక వసతి సౌకర్యాలు కల్పించాడు. ఎవరూ ఊహించని రీతిలో రెమ్యూనరేషన్ చెల్లించాడు. అక్షరాలా రూ. 25 కోట్ల రూపాయలు. తను స్టేజి పైకి రాగానే వేలాది మంది సినీ నటులు, ప్రముఖులు ఊగి పోయారు. తన గొంతు విప్పగానే పరవశించి పోయారు. ఇంతకు అతడిలో ఏముంది. మట్టితనపు వాసన ఉంది. తను పాడుతూ ఉంటే మైమరిచి పోవాల్సిందే. అంతలా తనలో తాను లీనమై పోవడమే కాదు కోట్లాది మందిని తనతో పాటే తీసుకు వెళతాడు. అందుకే రెమా అంటే అంత క్రేజ్. ఇప్పుడు యువతీ యువకులే కాదు పిల్లలు, పెద్దలంతా తన పాటతో ప్రయాణం చేస్తున్నారు.
రెమా అసలు పేరు డివైన్ ఇకుబోర్. తను 1 మే 2000లో పుట్టాడు. నైజీరియాలోని బెనిన్ సిటీ ..ఎడో తన స్వస్థలం. తనకు మరో రెండు పేర్లు కూడా ఉన్నాయి. రెమీ బాయ్ , రేవ్ లార్డ్. రెమా గాయకుడు మాత్రమే కాదు..రచయిత కూడా. రాపర్ గా గుర్తింపు పొందాడు. 2018 నుంచి పాటగాడిగా పాటలు అల్లుకుంటూ పోయాడు. తన ప్రస్థానం అప్రహతిహతంగా కొనసాగుతూ వస్తోంది. 2019లో డుమేబి పేరుతో విడుదల చేశాడు. అక్కడి నుంచి సంగీత వృత్తిని ప్రారంభించాడు రెమా. 2022లో రిలీజ్ చేసిన రేవ్ , రోజెస్ వాణిజ్య పరంగా భారీ ఆదరణ పొందింది. బిల్ బోర్డ్ 200లో 81వ స్థానంలో నిలిచింది. ఇందులో హిట్ సింగిల్ కామ్ డౌన్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. సెలీనా గోమెజ్ తో మూడవ స్థానం పొందింది. అంతే కాదు అమెరికా బిల్ బోర్డ్ హాట్ 100 చార్ట్ లో 58 వారాల పాటు రికార్డు స్థాయిలో తొలి స్థానంలో నిలిచింది.
రెండో ఆల్బమ్ హీస్ పేరుతో ఈ ఏడాది విడుదలైంది. బెనిన్ బాయ్స్ సింగిల్ మోస్ట్ పాపులర్ గా ఆదరణ పొందింది. సంగీత ప్రియులను మైమరిచి పోయేలా చేసింది. రెమా చిన్నతనంలోనే సోదరుడితో పాటు తండ్రిని కోల్పోయాడు. కానీ తల్లి అతడిని పెంచింది. అండగా నిలిచింది. తన ఆల్బంను యూట్యూబ్ లో 75 మిలియన్ల మందికి పైగా వీక్షించారు. ఇది ఓ రికార్డ్. ఇక దక్షిణాప్రికా సంగీత నిర్మాత, కళాకారుడు టోయా డెలాజీ , గ్యారేజ్ , జూలూ సాహిత్యం , ఇతర ఆఫ్రికన్ శైలులను మిళితం చేస్తూ 2019లో అఫ్రోరేవ్ రూపొందించాడు. ఇదే అతడిని రేవర్స్ అని పిలుచుకునేలా చేసింది. రెమా అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులను పొందాడు. ఆఫ్రికన్ సంగీతానికి స్పూర్తి దాయకంగా నిలిచాడు. కోట్లాది మందిని ప్రభావితం చేస్తున్నాడు రెమా. మరిన్ని పాటలతో మనల్ని అలరించాలని ఆశిద్దాం.