రాజ్యసభ సభ్యులుగా రేణుక..అనిల్
ఖరారు చేసిన ఏఐసీసీ హైకమాండ్
హైదరాబాద్ – ఏఐసీసీ ఊహించని షాక్ ఇచ్చింది. హైకమాండ్ తాజాగా కీలక ప్రకటన చేసింది. ఆయా రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటికే రాజ్యసభ సభ్యులుగా ఎంపిక చేసేందుకు వ్యూహాత్మకంగా పావులు కదిపింది. ఓ వైపు ఏఐసీసీ మాజీ చీఫ్ , సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీని రాజస్థాన్ నుంచి బరిలో ఉండేలా చూసింది.
ఇక తెలంగాణ రాష్ట్రానికి వచ్చే సరికి పోటీ ఎక్కువగా ఉండడంతో ఊహించని రీతిలో అనూహ్యంగా ఇద్దరి పేర్లను ముందుకు తీసుకు వచ్చింది. పార్టీ నుంచి సీనియర్ నాయకుడు మాకెన్ ను ఎంపిక చేసినట్లు ముందుగా ప్రచారం జరిగింది. కానీ ఉన్నట్టుండి ఆశావహులకు కోలుకోలేని షాక్ ఇచ్చింది హై కమాండ్.
ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా పేరు పొందిన సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరికి రాజ్యసభ సభ్యురాలిగా నామినేట్ చేసింది. ఆమెతో పాటూ విచిత్రం ఏమిటంటే అంజన్ కుమార్ యాదవ్ తనయుడు అనిల్ కుమార్ యాదవ్ ను ఖరారు చేసింది.
దీంతో మరోసారి తీవ్ర నిరాశకు లోనయ్యారు మాజీ మంత్రి జిల్లెల చిన్నారెడ్డి, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజహరుద్దీన్.