ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి
సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిన నేత
హైదరాబాద్ – ఫైర్ బ్రాండ్ గా పేరు పొందిన రేణుకా చౌదరి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. ఆమె ఖమ్మం జిల్లాలో కీలకమైన నాయకురాలిగా ఉన్నారు. ఈసారి తను కూడా పోటీ చేయాలని భావించారు. కానీ అనూహ్యంగా ఏఐసీసీ హైకమాండ్ ఉన్నట్టుండి రాజ్యసభకు ఎంపిక చేసింది. ఆమెతో పాటు అనిల్ కుమార్ యాదవ్ కు అవకాశం ఇచ్చింది.
రెండు సార్లు టీడీపీ తరపున రాజ్యసభకు ఎంపికయ్యారు. కేంద్ర మంత్రిగా పని చేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున తను రెండోసారి రాజ్యసభకు వెళ్లనున్నారు. చట్ట సభల్లో తన వాయిస్ ను వినిపించడంలో పేరు పొందారు రేణుకా చౌదరి.
మహిళా సాధికారతకు దర్పణంగా నిలిచారు ఆమె. ఖమ్మం ప్రాంతపు ఆడపడుచుగా రాజకీయాలలో తనదైన ముద్ర కనబర్చారు. దివంగత ఎన్టీఆర్ సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. బంజారా హిల్స్ నుంచి కార్పొరేటర్ గా గెలుపొందారు. లేడీ టైగర్ గా పాపులర్ అయ్యారు.
హెచ్ డీ దేవె గౌడ ప్రభుత్వం లో కేంద్ర ,ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశారు రేణుకా చౌదరి. 1998లో సోనియా గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1999-2004లో ఖమ్మం ఎంపీగా గెలుపొందారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పని చేశారు.