NEWSTELANGANA

రేణుకా చౌద‌రి నామినేష‌న్ దాఖ‌లు

Share it with your family & friends

హాజ‌రైన సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ – తెలంగాణ నుంచి రాజ్యస‌భ అభ్య‌ర్థిగా కేంద్ర మాజీ మంత్రి , ఫైర్ బ్రాండ్ గా పేరు పొందిన ఖ‌మ్మం జిల్లాకు చెందిన రేణుకా చౌద‌రి పార్టీ త‌ర‌పున నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ఆమె వెంట సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు.

ఈ సంద‌ర్బంగా సీఎం మీడియాతో మాట్లాడారు. పార్టీ కోసం ముందు నుంచీ క‌ష్ట‌ప‌డి ప‌ని చేస్తూ వ‌చ్చార‌ని, అపార‌మైన రాజ‌కీయ అనుభవం రేణుకా చౌద‌రికి ఉంద‌న్నారు. విశిష్ట‌మైన సేవ‌లు అందించింద‌ని, రేణుకా చౌద‌రి త‌న గొంతును బ‌లంగా వినిపిస్తుంద‌ని పార్టీ మ‌రోసారి న‌మ్మి ఛాన్స్ ఇచ్చింద‌న్నారు.

ఇదిలా ఉండ‌గా రేణుకా చౌద‌రి దివంగ‌త ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో చేరారు. జూబ్లీ హిల్స్ నుంచి కార్పొరేట‌ర్ గా ఎన్నిక‌య్యారు. త‌ద‌నంత‌రం లోక్ స‌భ ఎన్నిక‌ల్లో ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. రాజ్య‌స‌భ కు ఎంపిక కావ‌డం ఇది మూడోసారి.

ఏ విష‌యంపైన నైనా కుండ బ‌ద్ద‌లు కొట్టి మాట్లాడ‌టం ఆమె నైజం. ప్ర‌ధానంగా ఖ‌మ్మం జిల్లాలో త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ ఇమేజ్ స్వంతం చేసుకున్నారు రేణుకా చౌద‌రి. ఇక పార్టీ ప‌రంగా సంఖ్యా బ‌లం ఉండ‌డంతో ఆమె ఎన్నిక లాంఛ‌న ప్రాయం అని చెప్ప‌క త‌ప్ప‌దు.