హై కమాండ్ కు రుణపడి ఉన్నా
మాజీ మంత్రి రేణుకా చౌదరి
ఖమ్మం జిల్లా – కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐసీసీ హైకమాండ్ ఇవాళ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రం నుండి ఇద్దరిని రాజ్యసభ సభ్యులుగా ఎంపిక చేసింది. వారిలో ఖమ్మం జిల్లాకు చెందిన రేణుకా చౌదరి ఉండగా, సీనియర్ నాయకుడు అంజన్ కుమార్ యాదవ్ తనయుడు అనిల్ కుమార్ యాదవ్ కు అనూహ్యంగా ఛాన్స్ ఇచ్చింది.
మరో వైపు ఈసారి తమకు ఛాన్స్ వస్తుందని భావించారు మాజీ మంత్రి జిల్లెల చిన్నారెడ్డి, మాజీ ఎంపీ మహమ్మద్ అజహరుద్దీన్. వారికి ఈసారి కూడా నిరాశే మిగిలింది. ఇదిలా ఉండగా తనను రాజ్యసభ సభ్యురాలిగా ఎంపిక చేసినందుకు పార్టీ హైకమాండ్ కు ధన్యవాదాలు తెలిపారు రేణుకా చౌదరి.
తనపై నమ్మకం ఉంచినందుకు థ్యాంక్స్ తెలిపారు. అంతే కాదు ఎప్పటి లాగే తాను ప్రజల కోసం పని చేస్తానని, వారి గొంతు పార్లమెంట్ సాక్షిగా వినిపిస్తానని స్పష్టం చేశారు. గతంలో తాను కేంద్ర మంత్రిగా, పార్టీ పరంగా వివిధ హోదాలలో పని చేయడం జరిగిందన్నారు. కేంద్ర సర్కార్ పై యుద్దం చేసేందుకు ఇది తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నట్లు స్పష్టం చేశారు రేణుకా చౌదరి.