ఎన్నికలను పరిశీలించిన బృందం
23 దేశాల నుంచి ప్రతినిధులు హాజరు
న్యూఢిల్లీ – ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం ఇండియా. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. ఈ సందర్బంగా గత పది సంవత్సరాలుగా నరేంద్ర మోదీ సారథ్యంలో బీజేపీ సర్కార్ కొలువు తీరింది. మొత్తం 543 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈవీఎంలలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని పదే పదే ప్రతిపక్షాల నేతలు ఆరోపిస్తుండడంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఇందులో భాగంగా ప్రపంచంలోని పలు దేశాలను తమ దేశంలో జరిగే ఎన్నికలను పరిశీలించేందుకు రావాలని కోరారు. ఈ పిలుపునకు పలు దేశాల ప్రతినిధులు స్పందించారు. మొత్తం 23 దేశాల నుంచి టీంలు ఇక్కడ కొలువు తీరాయి. ఆయా దేశాల నుంచి వచ్చిన 75 మంది ప్రతినిధులు భారత్ కు చేరుకున్నారు.
ఇందులో రష్యా, ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్స్, భూటాన్, మంగోలియా, మడగాస్కర్, ఫిజీ, కిర్గిజ్ రిపబ్లిక్, మోల్డోవా, ట్యునీషియా, సీషెల్స్, కంబోడియా, నేపాల్, శ్రీలంక, జింబాబ్వే, బంగ్లాదేశ్, కజకిస్తాన్, జార్జియా, చిలీ, ఉజ్బెకిస్తాన్, మాల్దీవులు, పాపువా న్యూ గినియా, నమీబియా ప్రినిధులు ఉన్నారు.