Tuesday, April 22, 2025
HomeNEWSన్యూ ఇయ‌ర్ వేడుక‌ల‌కు ఆంక్ష‌లు

న్యూ ఇయ‌ర్ వేడుక‌ల‌కు ఆంక్ష‌లు

రాత్రి 10 త‌ర్వాత లౌడ్ స్పీక‌ర్లు బ్యాన్

హైద‌రాబాద్ – తెలంగాణ డీజీపీ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించారు. ఈవెంట్స్‌లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు. వేడుకల్లో అశ్లీల నృత్యాలు నిషేధం విధిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు డీజీపీ జితేంద‌ర్.

ఔట్‌డోర్‌లో రాత్రి 10 తర్వాత లౌడ్ స్పీకర్లు నిషేధిస్తున్న‌ట్లు తెలిపారు. పబ్‌లు, బార్లలో మైనర్లకు అనుమతి ఇచ్చే ప్ర‌సక్తి లేద‌ని హెచ్చ‌రించారు. డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు డీజీపీ జితేంద‌ర్. తాగి వాహనం నడిపితే రూ.10 వేలు జరిమానా విధిస్తామ‌ని పేర్కొన్నారు. రూల్స్ అధిగ‌మిస్తే 6 నెలలు జైలు శిక్ష విధిస్తామ‌ని అన్నారు.

ఎలాంటి ప‌ర్మిష‌న్స్ లేకుండా ఈవెంట్స్ నిర్వ‌హిస్తే చూస్తూ ఊరుకునే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. ముంద‌స్తుగా ప‌ర్మిష‌న్ తీసుకోవాల‌ని సూచించారు. గీత దాటితే వేటు త‌ప్ప‌ద‌ని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments