టీపీసీసీ చీఫ్ గా రేవంత్ మూడేళ్లు
నేటితో పూర్తయిన సందర్భంగా
హైదరాబాద్ – ఎనుముల రేవంత్ రెడ్డి గురించి పరిచయం చేయాల్సిన పని లేదు. ఎన్నో అవమానాలు మరెన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అన్నింటిని అధిగమించి ఊహించని రీతిలో తాను అనుకున్న టార్గెట్ ను పూర్తి చేశారు. అప్పటి దాకా తనపై అన్ని రకాలుగా దాడులు చేసినా, విమర్శలు గుప్పించినా, ఆరోపణలు చేసినా ఎక్కడా తగ్గలేదు.
పార్టీ పరంగా తను అడుగుడుగునా ఇక్కట్లను ఎదుర్కొన్నారు. కానీ అన్నింటిని యుద్దంలో సైనికుడిలాగా భరిస్తూనే సక్సెస్ అయ్యేందుకు నానా తంటాలు పడ్డారు. చివరకు తెలంగాణ రాష్ట్రంలో రాదని అనుకున్న , అంపశయ్యపై ఉన్న కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడమే కాదు ఆ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చారు ఎనుముల రేవంత్ రెడ్డి.
తను ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన బిడ్డ. ప్రధానంగా ఇక్కడి ప్రాంతానికి మట్టి వాసన ఎక్కువగా ఉంటుంది. వలసలకు పెట్టింది పేరు. ఈ ప్రాంతం నుంచి వచ్చిన తను పదే పదే తాను గుంపు మేస్త్రినంటూ చెబుతూ వస్తారు. టీపీసీసీ చీఫ్ గా పార్టీని గెలుపు బాట పట్టించాడు.
ఇదే సమయంలో పార్టీలో సైతం సీనియర్లను కాదని ఏకంగా సీఎం పీఠాన్ని అధిరోహించారు. ప్రస్తుతం పాలనా పరంగా తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా సరిగ్గా ఇదే రోజు టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టారు రేవంత్ రెడ్డి. ఇవాల్టితో తన పదవీ కాలం మూడేళ్లయింది.