తెలంగాణ సర్కార్ ఖుష్ కబర్
రూ. 500లకే వంట గ్యాస్ పథకం
హైదరాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖుష్ కబర్ చెప్పింది. రూ. 500లకే గ్యాస్ సిలిండర్ పథకం అమలు చేసేందుకు శ్రీకారం చుట్టింది. తాజాగా రాష్ట్రంలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో ఆరు ఉచిత హామీలు ఇచ్చింది. ఇందులో ఇప్పటికే రెండు గ్యారెంటీలను అమలు చేసింది. ప్రస్తుతం మరో రెండు గ్యారెంటీలు అమలు చేయాలని సంకల్పించింది. ఇందులో భాగంగా మహిళలకు కుటం, మతం , ప్రాంతంతో సంబంధం లేకుండా కేవలం రూ. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించింది.
ఇంటింటికీ ఉచితంగా గ్యాస్ పంపిణీ పథకం అమలు చేసి తీరుతామని పదే పదే ప్రకటిస్తూ వచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. మంగళవారం ఈ పథకానికి ఓకే చెప్పారు. ఇందుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఇచ్చిన మాట ప్రకారం అమలు చేసి తీరుతామని పేర్కొన్నారు.
గ్యాస్ డెలివరీ తీసుకునేటప్పుడు వినియోగదారులు పూర్తి ధర చెల్లించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన మొత్తాన్ని ముందుగా చమురు మార్కెటింగ్ కంపెనీలకు నెల వారీ ప్రాతిపదికన బదిలీ చేస్తుందన్నారు రేవంత్ రెడ్డి. అక్కడి నుంచి ఆయా కంపెనీలు తమ తమ వినియోగారులకు సబ్సిడీ మొత్తాన్ని తిరిగి వారి ఖాతాల్లో జమ చేస్తాయని చెప్పారు.