రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల ఆక్రమణపై ఫోకస్
స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని సీఎం రేవంత్ ఆదేశం
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో హైడ్రా కలకలం రేపుతోంది. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్బంగా సీరియస్ అయ్యారు సీఎం.
హైడ్రా తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా ఆక్రమణలకు గురైన చెరువులు, కుంటల జాబితాను వెంటనే సిద్దం చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఎవరైనా, ఏ స్థాయిలో ఉన్నా, ఏ పార్టీకి చెందిన వారైనా సరే ఉపేక్షించే ప్రసక్తి లేదని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
యుద్ద ప్రాతిపదికన చెరువుల ఆక్రమణలపై రాష్ట్ర మంతటా స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. చెరువుల ఆక్రమణలు క్షమించరాని నేరమని అన్నారు సీఎం. అన్ని జిల్లాల్లో వెంటనే చెరువులు, నాలాల ఆక్రమించుకున్న వారి లిస్టును తయారు చేయాలని స్పష్టం చేశారు .
హైడ్రా తరహాలో జిల్లాల్లో కలెక్టర్లు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు రేవంత్ రెడ్డి. చెరువుల ఆక్రమణలో ఎంతటి వారున్నా వదిలి పెట్టే ప్రసక్తి లేదన్నారు. చెరువుల, నాలాల ఆక్రమణకు పాల్పడిన వారిపై, వారికి సహకరించి అనుమతి ఇచ్చిన అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.