Friday, April 4, 2025
HomeNEWSకోటి మంది మ‌హిళ‌ల‌ను కోటీశ్వ‌రులు చేస్తాం

కోటి మంది మ‌హిళ‌ల‌ను కోటీశ్వ‌రులు చేస్తాం

సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి ప్ర‌క‌ట‌న

త‌మ ప్ర‌భుత్వం మ‌హిళ‌ల అభివృద్దికి పెద్ద‌పీట వేస్తోంద‌న్నారు సీఎం రేవంత్ రెడ్డి. నారాయ‌ణ‌పేట జిల్లా అప్ప‌క్ ప‌ల్లిలో ఇళ్ల నిర్మాణానికి శంకు స్థాప‌న చేశారు. అనంత‌రం జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పెట్రోల్ బంక్ ను ప్రారంభించారు. బీపీసీఎల్ కంపెనీ సహకారంతో దీనిని ఏర్పాటు చేశారు. పూర్తిగా మ‌హిళ‌లే న‌డిపిస్తుండ‌డం విశేషం. దేశంలోనే తొలిసారిగా పెట్రోల్ బంకును స్టార్ట్ చేయ‌డం సంతోషంగా ఉంద‌న్నారు సీఎం. మ‌హిళ‌లు ఆత్మ గౌర‌వంతో బ‌తికేందుకు స‌హాయ స‌హ‌కారాలు అంద‌జేస్తామ‌న్నారు.

ప్ర‌భుత్వ ప‌రంగా ఏ కార్య‌క్ర‌మం మొద‌లు పెట్టినా లేదా ఏ సంక్షేమ ప‌థ‌కం తీసుకు వ‌చ్చినా ముందుగా మ‌హిళ‌ల‌కే తొలి ప్రాధాన్య‌త ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు రేవంత్ రెడ్డి. మీరంతా ఆత్మ గౌర‌వంతో బ‌తుకుతార‌ని తాము న‌మ్ముతున్నామ‌ని అన్నారు. రాష్ట్రంలో మ‌హిళా శ‌క్తి 67 ల‌క్ష‌లు అన్నారు.

తెలంగాణ‌లో కోటి మంది మ‌హిళ‌ల‌ను కోటీశ్వ‌రులుగా మార్చ‌డ‌మే త‌మ ప్ర‌భుత్వం ముందున్న ల‌క్ష్య‌మ‌న్నారు. అన్ని రంగాల‌లో మ‌హిళ‌ల‌ను ప్రోత్స‌హిస్తోంద‌న్నారు. 600 ఆర్టీసీ బస్సులకూ యజమానులను చేశామ‌న్నారు. వెయ్యి మెగావాట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసేలా మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నామ‌న్నారు.

మహిళా స్వయం సహాయక ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకోవడానికి శిల్పారామం వద్ద స్టాల్స్ ఏర్పాటు చేసి ఇచ్చామ‌న్నారు సీఎం. త్వరలోనే మహిళా స్వయం సహాయక సంఘాలకు ఏడాదికి రెండు చీరలు కానుకగా ఇవ్వనున్నామ‌ని తెలిపారు. రూరల్, అర్బన్ అనే తేడా లేదు… తెలంగాణలో మహిళలంతా ఒక్కటేన‌న్నారు. ఎంపీ డీకే అరుణ కేంద్రం నుంచి నిధులు తీసుకు వ‌చ్చేలా కృషి చేయాల‌ని కోరారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments