శంషాబాద్ అరుదైన రికార్డ్
20.7 మిలియన్ల మంది జర్నీ
హైదరాబాద్ – శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు అరుదైన రికార్డు నమోదు చేసింది. గత నెల జనవరి 30న ఏకంగా 536 విమానాల రాక పోకలతో రికార్డ్ బ్రేక్ చేసింది. ఎయిర్ పోర్టు ఏర్పాటు చేసిన నాటి నుంచి నేటి వరకు ఒకే ఒక్క రోజు ఇంత పెద్ద ఎత్తున ఫ్లైట్స్ వచ్చినట్లు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నిర్వాహకులు వెల్లడించారు.
ఎయిర్ పోర్టు చరిత్రలోనే ఇది కీలకమైన రోజుగా అభివర్ణించారు. ఇప్పటి వరకు అత్యధిక రోజు వారీ ప్రయాణీకుల రద్దీ రోజుగా నమోదైనట్లు పేర్కొన్నారు. అంతే కాకుండా ఎయిర్ పోర్టులో జనవరి 31న ఏకంగా 20.7 మిలియన్లకు పైగా ప్రయాణీకులను కలిగి ఉందని స్పష్టం చేశారు.
ఇది గత ఏడాది 2023లో రికార్డు స్థాయిలో కలిగి ఉందని తెలిపారు. 2024 ఆర్థిక సంవత్సరంలో శంషాబాద్ ఎయిర్ పోర్టు ప్రతి నెలా దాదాపు 2 మిలియన్ల మంది ప్రయాణీకులను చేర వేసిందని పేర్కొన్నారు. దేశంలోని పలు చోట్ల ఎయిర్ పోర్టులు ఉన్నప్పటికీ ఎక్కువగా ఈ ఎయిర్ పోర్టు నుంచే జర్నీ చేయడం విశేషం.