ఆ ఆరోపణలు అబద్దం – ఆర్జీవీ
వ్యూహం దాసరి కిరణ్ నిర్మాత
హైదరాబాద్ – ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను తీసిన వ్యూహం సినిమాకు సంబంధించి వస్తున్న ఆరోపణలను కొట్టి పారేశారు. శనివారం ఎక్స్ వేదికగా స్పందించారు. ఏపీ ఫైబర్ నెట్ సమస్యకు సంబంధించి తనపై , తన భాగస్వామి రవి వర్మపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన విమర్శలు పూర్తిగా నిరాధారమైనవని పేర్కొన్నారు.
శ్రీకాంత్ ఫైనాన్స్ చేసిన దాసరి కిరణ్ నిర్మించిందే వ్యూహం చిత్రమని స్పష్టం చేశారు రామ్ గోపాల్ వర్మ. రవివర్మ తన స్వతంత్ర హోదాలో ఏపీ ఫైబర్ నెట్ హక్కులను కలిగి ఉన్న శ్రీకాంత్ నుండి కొనుగోలు చేశారని తెలిపారు.
సినిమాను ప్రసారం చేసినందుకు రూ. 2 కోట్లు ఇవ్వడం జరిగిందన్నారు. ఇది ఒప్పందంలో చేసుకున్న భాగంగానే చెల్లించారని తెలిపారు ఆర్జీవీ.
60 రోజుల పాటు హక్కులు ఇవ్వడం జరిగిందన్నారు. టిడిపి ఫిర్యాదుతో ఎన్నికల సంఘం దానిని నిలిపి వేయక ముందే 150 వేల వీక్షణలను పొందిందన్నారు. ఏపీ ఫైబర్ నెట్ రవివర్మకు బ్యాలెన్స్ అందించడంలో విఫలమైందని పేర్కొన్నారు.
తమపై నిరాధార వార్తలను ప్రసారం చేసిన టీవీ5, ఏబీఎన్, మహా , ఇతర ఛానళ్లపై పరువు నష్టం దావా వేయబోతున్నామని వెల్లడించారు రామ్ గోపాల్ వర్మ.