ఆ సినిమా చూసి ఏడ్చా
ఏదో ఒక రోజు కప్ గెలవాలి
కోల్ కతా – స్టార్ క్రికెటర్ కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఆటగాడు రింకూ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎన్నో కష్టాలు అనుభవించానని, ఇప్పుడు తనకంటూ ఓ ఇమేజ్ వచ్చిందన్నారు. దీనికి ప్రధాన కారణం తనను అక్కున చేర్చుకుని ఆదరించిన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు కోచ్ కు, యజమాని షారుక్ ఖాన్ కు సర్వదా రుణపడి ఉంటానని అన్నాడు.
ప్రస్తుతం ఐపీఎల్ 2024 ఆఖరి అంకానికి చేరుకుంది. ఇవాళ బలమైన హైదరాబాద్ లో కేకేఆర్ తలపడనుంది. నువ్వా నేనా అన్న రీతిలో మ్యాచ్ జరగనుంది. ఇక కోల్ కతా అద్బుతంగా ఆడుతూ ఏకంగా టేబుల్ లో టాప్ లోకి చేరింది.
ఈ సందర్భంగా కేకేఆర్ ఆటగాడు రింకూ సింగ్ మీడియాతో మాట్లాడాడు. తనకు ఎక్కువగా ఆడేందుకు ఛాన్స్ రావడం లేదని వాపోయాడు. ఎందుకంటే తాను ఆఖరులో వస్తున్నానని పరుగులు చేసేందుకు సమయం ఉండడం లేదన్నాడు.
మొత్తంగా తాము సమిష్టిగా రాణిస్తున్నాడని ఇది తమ జట్టుకు అదనపు బలంగా మారనుందని అన్నాడు. ఇక తనను ఎక్కువగా ప్రభావితం చూసిన సినిమా 12 ఫెయిల్ మూవీ అని తెలిపాడు. దానిని చూసి ఏడ్చానని చెప్పాడు. జట్టులో ఆఖరులో వచ్చినా కీలకమైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు రింకూ సింగ్.