NEWSINTERNATIONAL

బంగ్లాదేశ్ చీఫ్ జ‌స్టిస్ రాజీనామా చేయాలి

Share it with your family & friends

గంట పాటు టైం ఇచ్చిన ఆందోళ‌న‌కారులు

బంగ్లాదేశ్ – బంగ్లాదేశ్ లో ఉద్రిక్త ప‌రిస్థితులు ఇంకా అదుపు లోకి రాలేదు. మ‌త ఛాంద‌స‌వాదులైన ఆందోళ‌న‌కారులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చీఫ్ జ‌స్టిస్ ఒబైదుల్ హ‌స‌న్ వెంట‌నే త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు.

కేవ‌లం గంట పాటు స‌మ‌యం మాత్ర‌మే ఇచ్చారు. ఒక‌వేళ చీఫ్ జ‌స్టిస్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌కుంటే త‌న నివాసాన్ని ముట్ట‌డిస్తామ‌ని, దాడుల‌కు పాల్ప‌డ‌తామ‌ని హెచ్చ‌రించారు.

ఫుల్ కోర్టు స‌మావేశాన్ని త‌క్ష‌ణ‌మే నిలిపి వేయాల‌ని హుకూం జారీ చేశారు. ఇదే స‌మ‌యంలో తాత్కాలిక ప్రభుత్వ యువజన , క్రీడా మంత్రిత్వ శాఖ సలహాదారు ఆసిఫ్ మహమూద్ కూడా ప్రధాన న్యాయమూర్తిని బేషరతుగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

మ‌రో వైపు బంగ్లాదేశ్ దేశానికి ప్ర‌ధాన‌మంత్రిగా ఉన్న షేక్ హ‌సీనా ఆందోళ‌న‌కారుల దెబ్బ‌కు దిగి వ‌చ్చారు. త‌న ప‌ద‌వికి రాజీనామా చేసి ప్ర‌స్తుతం భార‌త దేశంలో ఆశ్ర‌యం పొందారు. ఈ సంద‌ర్బంగా త‌న త‌న‌యుడు సాజిబ్ ఆజాద్ జాయ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. బంగ్లాదేశ‌లో భార‌త్ జోక్యం చేసుకోవాల‌ని కోరారు.