రోహిత్ ను తప్పించడంపై రచ్చ
హైదరాబాద్ – భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మను ఆస్ట్రేలియాలో జరుగుతున్న 5వ టెస్టు మ్యాచ్ నుంచి తప్పించడంపై ఫ్యాన్స్ నిప్పులు చెరుగుతున్నారు. సోషల్ మీడియాలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ను ఏకి పారేస్తున్నారు. ఏకంగా రిప్ అంటూ పోస్టులతో హోరెత్తిస్తున్నారు. రోహిత్ శర్మను అవమానకరంగా తప్పించారంటూ ఫైర్ అయ్యారు. గంభీర్, విరాట్ కోహ్లీ కలిసి గేమ్ ఆడారంటూ ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఇది ట్రెండింగ్ లో కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా ఇటీవలే రోహిత్ శర్మ సారథ్యంలో టి20 వరల్డ్ కప్ సాధించింది టీమిండియా. అద్భుతమైన కెప్టెన్సీతో జట్టును విజయ పథంలో నడిపించాడు. కానీ ఆ తర్వాత జరిగిన ఫార్మాట్ లలో రోహిత్ శర్మ ఆశించిన మేర రాణించలేదు.
తాజాగా భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా ఆసిస్ తో 5 టెస్టు మ్యాచ్ ల సీరీస్ ఆడుతోంది. తొలి టెస్టులో వ్యక్తిగత కారణీల రీత్యా ఆడలేదు రోహిత్ శర్మ. ఆ తర్వాత జరిగిన 2, 3, 4 టెస్టులలో ఆడాడు . కేవలం 36 రన్స్ మాత్రమే చేశాడు. దీంతో తనను తప్పించాడు హెడ్ కోచ్.