SPORTS

ఐపీఎల్ వేలంలో రిష‌బ్ పంత్ రికార్డ్

Share it with your family & friends

రూ. 27 కోట్ల‌కు స్వంతం చేసుకున్న ఎల్ఎస్జీ

జెడ్డా – జెడ్డా వేదిక‌గా ప్రారంభ‌మైంది ఐపీఎల్ మెగా వేలం పాట‌. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ఇప్ప‌టి వ‌ర‌కు అత్య‌ధిక ధ‌ర ప‌లికిన ఆట‌గాడిగా పేరు పొందిన శ్రేయ‌స్ అయ్య‌ర్ ను దాటేశాడు క్రికెట‌ర్ రిష‌బ్ పంత్. ఏకంగా రూ. 27 కోట్ల‌కు అమ్ముడు పోయాడు. పంత్ ను ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ చేజిక్కించుకుంది. అత‌డిని ద‌క్కించు కునేందుకు ప‌లు ఫ్రాంచైజీలు పోటీ ప‌డ్డాయి. కానీ చివ‌ర‌కు ల‌క్నో కైవ‌సం చేసుకుంది.

ఐపీఎల్ హిస్ట‌రీలోనే అత్యంత ఖ‌రీదైన ఆట‌గాడిగా మారి పోయాడు పంత్. ఇదిలా ఉండ‌గా గ‌తంలో పంజాబ్ కింగ్స్ రూ.26.75 కోట్లకు ఎంపిక చేసిన అయ్యర్ రికార్డును పంత్ బద్దలు కొట్టాడు. అంతకు ముందు, ఐపిఎల్ 2025 వేలంలో ఆర్‌టిఎమ్ కార్డ్ ద్వారా రూ. 18 కోట్లకు అమ్ముడైన మొదటి ఆటగాడు అర్ష్‌దీప్ సింగ్.

ఈమార్క్యూ సెట్లు, క్యాప్డ్ బ్యాటర్లు, ఆల్ రౌండర్లు, వికెట్ కీపర్లు, క్యాప్డ్ బౌలర్లు. మొదటి రోజు చివరి సెట్‌లో మొదటి అన్‌క్యాప్డ్ ప్లేయర్స్ సెట్ ఉంటుంది. సౌదీ అరేబియాలోని జెడ్డాలో వేలం నిర్వహిస్తున్నారు.

పంత్, అయ్యర్ , అర్ష్‌దీప్‌లు వేలం మొదటి రోజున ప్రదర్శించబడే మార్క్యూ ప్లేయర్‌ల మొదటి సెట్‌లో జాబితా చేయబడ్డారు, రెండవ దానిలో రాహుల్, యుజ్వేంద్ర చాహల్, మహ్మద్ షమీ , మహ్మద్ సిరాజ్ ఉన్నారు.