పంత్ కెప్టెన్సీ ఇన్నింగ్స్
43 బాల్స్ 86 పరుగులు
న్యూఢిల్లీ – ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ కు చుక్కలు చూపించింది ఢిల్లీ క్యాపిటల్స్. ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 224 రన్స్ చేసింది. అనంతరం భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ఆఖరు బంతి వరకు పోరాడింది. కానీ దురదృష్టం ఆ జట్టును వెంటాడింది. కేవలం 4 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
ఇక ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఓ వైపు త్వరగా వికెట్లు కోల్పోయినా ఎక్కడా ఆత్మ స్థైర్యాన్ని కోల్పోలేదు. గాయం కారణంగా ఆటకు దూరమై తిరిగి వచ్చిన కెప్టెన్ రిషబ్ పంత్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. గుజరాత్ బౌలర్లను ఉతికి ఆరేశాడు.
పంత్ కు హర్షల్ పటేల్ తోడు కావడంతో స్కోర్ బోర్డు పరుగులు తీసింది. రిషబ్ పంత్ 43 బాల్స్ ఎదుర్కొని
86 రన్స్ చేశాడు. ఇందులో 5 ఫోర్లు 8 సిక్సర్లు ఉన్నాయి. ఇక హర్షల్ పటేల్ 43 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు 4 సిక్సర్లతో 66 రన్స్ చేశాడు. గుజరాత్ జట్టులో మిల్లర్ 23 బాల్స్ ఎదుర్కొని 55 రన్స్ చేశాడు. ఇందులో 6 ఫోర్లు 3 సిక్సర్లు ఉన్నాయి. సుదర్శన్ 39 బంతుల్లో 65 పరుగులు చేశాడు. ఇందులో 7 ఫోర్లు 2 సిక్సర్లు ఉన్నాయి.