పరాగ్ సూపర్ జైశ్వాల్ జోర్దార్
అయినా తప్పని ఓటమి
హైదరాబాద్ – ఐపీఎల్ 2024లో భాగంగా హైదరాబాద్ వేదికగా సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది రాజస్థాన్ రాయల్స్ జట్టు. చివరి బంతి దాకా పోరాడింది. ఒక రకంగా క్రికెట్ ఫ్యాన్స్ కు ఫుల్ జోష్ నింపేలా చేసింది.
హైదరాబాద్ స్కిప్పర్ పాట్ కమిన్స్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 201 రన్స్ చేసింది. అనంతరం 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ అద్భుతమైన పోరాట పటిమను ప్రదర్శించింది.
ఆదిలోనే బట్లర్ , శాంసన్ వికెట్లు కోల్పోయింది. ఒకే ఒక్క పరుగుకు 2 వికెట్లు పడి పోవడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఈ సమయంలో మైదానంలోకి దిగిన రియాన్ పరాగ్ జైశ్వాల్ తో కలిసి పరుగులు పెట్టించాడు. బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. 77 రన్స్ చేస్తే 67 పరుగులతో జైశ్వాల్ దుమ్ము రేపాడు. రాజస్థాన్ ఓటమి పాలైనా క్రికెటర్లతో పాటు అభిమానుల మనసులు గెలుచుకున్నారు.
ఇక ఈ ఐపీఎల్ లో 1,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు రియాన్ పరాగ్. మొత్తంగా గొప్ప మ్యాచ్ చూసిన ఆనందం కలిగింది.