పరాగ్ పరుగుల వరద
జైపూర్ – ఈసారి జరుగుతున్న ఐపీఎల్ 2024లో ఊహించని రీతిలో దేశీయ ఆటగాళ్లు దుమ్ము రేపుతున్నాయి. గత ఏడాది విదేశీ క్రికెటర్లు సత్తా చాటితే ఈసారి మాత్రం అందుకు భిన్నంగా ఆడుతున్నారు మనోళ్లు. అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో తమకు ఎదురే లేదంటున్నారు. పోటీకి సై అంటున్నారు.
ఇక దేశీవాలీ టోర్నీలో దుమ్ము రేపుతూ హాట్ టాపిక్ గా మారాడు యంగ్ అస్సామీ క్రికెటర్ రియాన్ పరాగ్ . ఐపీఎల్ లో భాగంగా జరిగిన తొలి లీగ్ మ్యాచ్ లో కెప్టెన్ సంజూ శాంసన్ తో కలిసి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. లక్నోకు చుక్కలు చూపించాడు.
తాజాగా హోం గ్రౌండ్ లో రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ కు చుక్కలు చూపించాడు. ఒకానొక దశలో 36 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న తన జట్టుకు అద్భుతమైన ఆట తీరుతో ఆదుకున్నాడు.
రియాన్ పరాగ్ కేవలం 45 బంతులు మాత్రమే ఎదుర్కొన్నాడు. ఏకంగా 7 ఫోర్లు, 6 సిక్సర్లు కొట్టాడు. ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు. ఇక రాజస్థాన్ బ్యాటింగ్ లో బౌలింగ్ లో రాణించింది. డీసీని 12 రన్స్ తేడాతో ఓడించింది.