రియాన్ పరాగ్ వైరల్
ఐపీఎల్ 2024లో సూపర్
అస్సాం – రియాన్ పరాగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత ఐపీఎల్ సీజన్ లో పేలవమైన ప్రదర్శనతో తీవ్ర నిరాశ పరిచాడు. కానీ ఈసారి బీసీసీఐ ఆధ్వర్యంలో జరుగుతున్న 17వ ఐపీఎల్ సీజన్ లో దుమ్ము రేపాడు. ప్రత్యర్థులకు తన ఆట తీరుతో దడ పుట్టించాడు. జట్టు కష్ట సమయంలో ఆదుకున్నాడు. భారీ పరుగులతో విరుచుకు పడ్డాడు.
కళ్లు చెదిరే షాట్స్ తో ఫ్యాన్స్ కు ఫుల్ జోష్ నింపేలా చేశాడు. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ జట్టులో కీలకమైన ప్లేయర్ గా మారాడు. ఆశించిన దాని కంటే ఎక్కువ పర్ ఫార్మెన్స్ ఇచ్చాడు. దీంతో బీసీసీఐ కూడా పరాగ్ పై కన్నేసింది. చివరకు కేరళ స్టార్ క్రికెటర్, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ కు ఛాన్స్ ఇచ్చింది. టీ20 వరల్డ్ కప్ లో చోటు కల్పించింది.
ఇది పక్కన పెడితే జట్టు పరంగా మూల స్తంభంగా మారాడు రియాన్ పరాగ్. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఉన్నట్టుండి వైరల్ గా మారాడు . దీనికి కారణం ఏమిటంటే మ్యాచ్ సందర్బంగా మనోడు యోగా చేయడం ప్రారంభించాడు. సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.