వైసీపీ అధికార ప్రతినిధిగా ఆర్కే రోజా
నియమించిన పార్టీ బాస్ వైఎస్ జగన్
అమరావతి – ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్సీపీ బాస్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో తాజాగా జరిగిన ఎన్నికల్లో ఘోరంగా పార్టీ దెబ్బతిన్నది. మొత్తం 175 స్థానాలకు గాను కేవలం 11 స్థానాలకే సరిపెట్టు కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పార్టీకి పునర్ వైభవం తీసుకు వచ్చేందుకు తాను కృషి చేస్తున్నారు.
ఇందులో భాగంగా పార్టీలో ప్రక్షాళన ప్రారంభించారు. చిత్తూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రముఖ సినీ నటి , వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా సెల్వమణికి కీలకమైన బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఆర్కే రోజాతో పాటు పలువురు సీనియర్లకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
తాజాగా జగన్ రెడ్డి కీలక పదవి కట్టబెట్టారు ఆర్కే రోజా సెల్వమణికి. ఆమెను పార్టీ అధికార ప్రతినిధిగా నియమిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు మాజీ సీఎం ఆదేశాల మేరకు పార్టీ ప్రకటన చేసింది. దీంతో పాటు మాజీ మంత్రివర్యులు, పుంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్(PAC Member)గా నియమించారు .
అంతే కాకుండా చిత్తూరు జిల్లాతో పాటుగా తిరుపతి జిల్లా పార్టీ అధ్యక్షులుగా నియమించిన వైయస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్ రెడ్డి.