ఆర్కే రోజా ఆస్తులు రూ. 13.7 కోట్లు
47 శాతం పెరిగిన స్థిర, చర ఆస్తులు
అమరావతి – ప్రముఖ నటి, ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి ఆస్తులు భారీగా పెరిగాయి. ఈ విషయం తాజాగా ఆమె నామినేషన్ దాఖలు చేసిన అఫిడవిట్ లో పేర్కొంది. గతంలో 2019లో జరిగిన ఎన్నికల్లో కంటే ఈసారి ఎన్నికల వరకు చూస్తే 47 శాతం అదనంగా పెరగడం విశేషం.
ఆర్కే రోజా ప్రస్తుతం చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019లో ఆమె ప్రకటించిన ఆస్తులు రూ. 9.3 కోట్లు. తాజాగా ప్రకటించిన ఆస్తుల పరంగా చూస్తే భారీగా పెరిగాయి. రూ. 5.9 కోట్ల విలువ చేసే చరాస్థులు ఉండగా రూ. 7.8 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయని పేర్కొన్నారు ఆర్కే రోజా తన అఫిడవిట్ లో .
విచిత్రం ఏమిటంటే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న మార్గదర్శి చిట్ ఫండ్స్ లో ఆర్కే రోజా సెల్వమణి రూ. 39 లక్షలు పెట్టుబడిగా పెట్టింది. ఆమెకు బెంజ్ తో సహా 9 కార్లు ఉన్నాయి. వీటి విలువ మొత్తం రూ. కోటికి పైగానే ఉంటుందని అంచనా. ఆర్కే రోజాపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు. ఇంటర్ వరకు మాత్రమే చదువుకుంది.
ప్రముఖ తమిళ దర్శకుడు సెల్వమణిని పెళ్లి చేసుకుంది. ఆమెకు పిల్లలు ఉన్నారు.