నేనెప్పుడూ ప్రజా పక్షమే
మాజీ మంత్రి ఆర్కే రోజా
చిత్తూరు జిల్లా – మాజీ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్బంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు ఆర్కే రోజా సెల్వమణి. తాను గెలిచినా ఓడిచినా పట్టించుకోనని , తన ధ్యాస అంతా ప్రజల కోసం ఏం చేయాలన్న దానిపైనే ఉంటుందని స్పష్టం చేశారు. కొందరు గెలిచాక జనం గురించి పట్టించుకోరని ఎద్దేవా చేశారు.
అధికారంలో ఉన్నా లేక పోయినా లేదా ప్రతిపక్షంలో ఉన్నా తాను నిత్యం ప్రజల పక్షం వహించేందుకే ఎక్కువగా ప్రయత్నం చేస్తానని చెప్పారు ఆర్కే రోజా సెల్వమణి. ప్రజా సమస్యలపై పోరాడేందుకు అందరికంటే ముందు ఉంటానని స్పష్టం చేశారు.
అధికారంలో లేక పోయినంత మాత్రాన ప్రజలకు దూరంగా ఉంటామని అనుకోవడం భ్రమ అని కొట్టి పారేశారు. పార్టీ శ్రేణులు అధైర్య పడాల్సిన అవసరం లేదని తానెప్పుడూ అండగా ఉంటానన్నారు. ప్రతి ఒక్కరు ప్రజలకు అండగా నిలబడి పార్టీ పటిష్ఠతకు పాటుపడాలన్నారు.