NEWSANDHRA PRADESH

ఎగ్జిట్ పోల్స్ అబ‌ద్దం జ‌గ‌నే సీఎం

Share it with your family & friends

స్ప‌ష్టం చేసిన మంత్రి ఆర్కే రోజా

తిరుమ‌ల – ఏపీ ప‌ర్యాట‌క శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వ‌మ‌ణి సీరియ‌స్ కామెంట్స్ చేశారు. ఆమెతో పాటు మంత్రి నారాయ‌ణ స్వామి ఆదివారం తిరుమ‌ల‌లో శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకున్నారు. అనంత‌రం మీడియాతో మాట్లాడారు ఆర్కే రోజా సెల్వ‌మ‌ణి.

ఎగ్జిట్ పోల్స్ ఎవ‌రికి వారు తామే గెలుస్తామ‌ని ప్ర‌క‌టిస్తున్నార‌ని , దీని విష‌యంలో తాము న‌మ్మ‌డం లేద‌న్నారు. త‌మ‌కు గెలుస్తామ‌ని పూర్తి న‌మ్మ‌కంతో ఉన్నామ‌ని చెప్పారు ఆర్కే రోజా సెల్వ‌మ‌ణి. మ‌రోసారి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సీఎం కావ‌డం త‌ప్ప‌ద‌న్నారు.

ఇప్ప‌టికే త‌మ పార్టీ అన్ని ఏర్పాట్ల‌ను కూడా చేసింద‌ని చెప్పారు. ఈనెల 9న ఉద‌యం 9.18 నిమిషాల‌కు విశాఖ‌లో రెండోసారి సీఎంగా కొలువు తీరుతార‌ని, ఇది చ‌రిత్ర చెప్పిన స‌త్య‌మ‌ని పేర్కొన్నారు. ప్ర‌జ‌లు అభివృద్దికి, సంక్షేమ ప‌థ‌కాల‌కు ఓటు వేశార‌ని, ఇది పోలింగ్ రోజున స్ప‌ష్ట‌మైంద‌ని చప్పారు ఆర్కే రోజా సెల్వ‌మ‌ణి. చంద్ర‌బాబు నాయుడు వ్య‌వ‌స్థ‌ల‌ను మ్యానేజ్ చేస్తన్నారంటూ ఆరోపించారు.