NEWSANDHRA PRADESH

ఓటు కీల‌కం భ‌విష్య‌త్తుకు మూలం

Share it with your family & friends

ఓటు వేసిన ఆర్కే రోజా సెల్వ‌మ‌ణి

చిత్తూరు జిల్లా – రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వ‌మ‌ణి సోమ‌వారం త‌న ఓటు హ‌క్కు వినియోగించుకున్నారు. ఆమె కుటుంబంతో క‌లిసి పోలింగ్ స్టేష‌న్ వ‌ద్ద‌కు వ‌చ్చారు. ఓట‌ర్ల‌ను ప‌ల‌క‌రించారు. ఓటు అనేది కీల‌క‌మ‌ని , దానిని స‌ద్వినియోగం చేసుకునేందుకు ప్ర‌య‌త్నం చేయాల‌ని సూచించారు.

ప్ర‌భుత్వం కూడా సెల‌వు కూడా ఇచ్చింద‌ని, దీనిని స‌ద్వినియోగం చేసుకుని ప్ర‌తి ఒక్క‌రు త‌మ ఓటు వేయాల‌ని పిలుపునిచ్చారు మంత్రి ఆర్కే రోజా సెల్వ‌మ‌ణి. ఓటు వేసిన అనంత‌రం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఓట‌ర్లు అత్యంత తెలివైన వార‌ని, వారికి ఎవ‌రికి వేయాల‌నేది తెలుస‌ని పేర్కొన్నారు.

ఒక‌రు చెబితే ఓటు వేయ‌ర‌ని స్ప‌ష్టం చేశారు. త‌మ‌కు పూర్తి న‌మ్మ‌కం ఉంద‌ని, రాబోయే రోజుల్లో తాము గెల‌వ‌డం ఖాయ‌మ‌ని తేలి పోయింద‌ని అన్నారు. ప్ర‌జ‌లు భారీ ఎత్తున ఓటు వేసేందుకు వ‌స్తున్నార‌ని , ఇది శుభ ప‌రిణామ‌మ‌ని పేర్కొన్నారు ఆర్కే రోజా సెల్వ‌మ‌ణి.

తమ ప్ర‌భుత్వం ప్ర‌ధానంగా సంక్షేమం కోసం ప‌ని చేసింద‌ని స్ప‌ష్టం చేశారు. ఇంకొన్ని రోజుల్లో ఆస‌క్తిక‌ర‌మైన ఫ‌లితాలు వెల్ల‌డి కానున్నాయ‌ని, అంత దాకా వేచి చూడ‌టం మాత్ర‌మే మిగిలి ఉంద‌ని అన్నారు.