పోలీసులకు పవర్ లేకుండా చేశారు – రోజా
పరామర్శించకుండా అడ్డుకుంటే ఎలా
తిరుపతి – మాజీ మంత్రి, వైసీపీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా సెల్వమణి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ వత్తిళ్ల కారణంగానే పోలీసులు సరిగా పని చేయడం లేదని ఆవేదన చెందారు. మెటర్నిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని పరామర్శించేందుకు వెళితే తనను లోపలికి అనుమతించక పోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు ఆర్కే రోజా సెల్వమణి.
చంద్రగిరి ఎమ్మెల్యే నాని భార్య ను లోపలికి ఎలా అనుమతించారని ప్రశ్నించారు. బీహార్ లో ఇలాంటి దారుణ సంఘటనలు జరిగేవని ఇప్పుడు ఏపీలో ఇవి మామూలై పోయాయని వాపోయారు. సిఎం చంద్రబాబు నాయుడు పోలీసుల పై ఒత్తిడి చేశారని ఆరోపించారు ఆర్కే రోజా సెల్వమణి.
పోలీసు ఉన్నతాధికారులపై ఎంత ఒత్తిడి చేస్తున్నారో అర్థం చేసుకోగలమన్నారు. ఇలాంటి ఘటనలు జరక్కుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఒక డమ్మి పీసును తీసుకు వచ్చి హోం మంత్రి చేశారంటూ సంచలన కామెంట్స్ చేశారు ఆర్కే రోజా సెల్వమణి.
లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగ అమలు చేస్తున్నారని, తన పని తాను చేసుకు పోతున్నాడని, ఇక బాలయ్య షూటింగ్ లు చేసుకుంటూ ఎం జాయ్ చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ప్రశ్నిస్తామని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు నోరు మెదపడం లేదన్నారు. చంద్రబాబు, లోకేష్ లు ఇద్దరు కలిసి పోలీసులను బదిలీలు చేయించారంటూ మండిపడ్డారు. లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పిందన్నారు ఆర్కే రోజా సెల్వమణి.