తేలి పోయిందన్న మాజీ మంత్రి రోజా
అమరావతి – ఏపీ మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్కే రోజా సెల్వమణి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు. అసెంబ్లీ సాక్షిగా ఇన్నాళ్లు తమ మీద చేస్తూ వస్తున్న ఆరోపణలు తప్పని తేలి పోయిందని పేర్కొన్నారు.
తమ ప్రభుత్వం లో వాలంటీర్ల ద్వారా మహిళల అక్రమ రవాణా జరిగిందని, 30 వేల మంది మహిళలు మిస్ అయ్యారని చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధం అన్నారు. ఇదే విషయాన్ని సాక్షాత్తు ఏపీ రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత సభ సాక్షిగా వివరాలు వెల్లడించారని తెలిపారు.
ఐదేళ్ల పదవీ కాలంలో కేవలం మిస్సింగ్ కు సంబంధించి కేవలం 34 మంది మాత్రమే మహిళల అక్రమ రవాణాకు సంబంధించి కేసులు నమోదైనట్లు చెప్పారని , ఇప్పుడు ఎవరివి అబద్దాలో తేలి పోయిందన్ఆనరు ఆర్కే రోజా సెల్వమణి.
ఇదిలా ఉండగా మహిళల అక్రమ రవాణాకు సంబంధించి మంత్రి లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారని, ఇందుకు సంబంధించి ప్రూఫ్ కూడా పోస్ట్ లో షేర్ చేశారు మాజీ మంత్రి. గతంలోనే మిస్సింగ్ కేసులలో 99.5 శాతంకి పైగా మహిళలను గుర్తించారని కేంద్ర హోంశాఖ కూడా పార్లమెంట్ లో స్పష్టం చేసిందని, ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలంటూ సూచించారు .