40 శాతం ఓట్లతో 11 సీట్లు ఎలా..?
మాజీ మంత్రి ఆర్కే రోజా అనుమానం
అమరావతి – ఏపీ మాజీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి షాకింగ్ కామెంట్స్ చేశారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. 40 శాతం ఓట్లతో దేశంలో నరేంద్ర దామోదర దాస్ మోడీ ప్రధానమంత్రి అయ్యాడని, 40 శాతం ఓట్లతో తెలంగాణ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడని అన్నారు.
కానీ ఇదే 40 శాతం ఓట్లు వచ్చిన వైసీపీ పార్టీకి 11 సీట్లు రావడం ఏమిటని, ఇందులో ఏదో మతలబు దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై కచ్చితంగా విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. అంతే కాకుండా చర్చ కూడా కొనసాగాలని అభిప్రాయం వ్యక్తం చేశారు ఆర్కే రోజా సెల్వమణి.
ఇదిలా ఉండగా తాజాగా రాష్ట్రంలో జరిగిన శాసన సభ, లోక్ సభ ఎన్నికల్లో ఊహించని రీతిలో ఫలితాలు వచ్చాయి. 175 శాసన సభ స్థానాలకు గాను 164 స్థానాలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి దక్కాయి. వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. 25 లోక్ సభ స్థానాలకు గాను 21 స్థానాలు కూటమి గెలుపొందడం విశేషం.