NEWSANDHRA PRADESH

ష‌ర్మిల కామెంట్స్ రోజా సీరియ‌స్

Share it with your family & friends

నిరాధార ఆరోప‌ణ‌లు చేస్తే ఎలా..?

అమ‌రావ‌తి – ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల జ‌గ‌న్ రెడ్డిపై చేసిన కామెంట్స్ పై సీరియ‌స్ అయ్యారు మాజీ మంత్రి ఆర్కే రోజా సెల్వ‌మ‌ణి. ఆమె చేసిన ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వం లేద‌న్నారు. సెకీ ఒప్పందానికి సంబంధించి పూర్తి ఆధారాలు ఇవ్వ‌డం జ‌రిగింద‌న్నారు. ఎవ‌రో ఇస్తే వాటిని అడ్డం పెట్టుకుని అడ్డ‌గోలుగా మాట్లాడితే ఎలా అంటూ మండిప‌డ్డారు. ఇది మంచి ప‌ద్ధ‌తి కాద‌న్నారు. అదానీ కోసం తాము ప‌రుగులు తీయ‌లేద‌న్నారు. జ‌గ‌న్ పై బుర‌ద చ‌ల్ల‌డం మానుకోవాల‌ని ఎక్స్ వేదిక‌గా సూచించారు.

మీకు తెలుగు అర్థం కాదా? ఇంగ్లీష్ అర్థం కాదా? జ‌గ‌న్ రెడ్డి రెండు భాష‌ల్లో సెకీతో ఒప్పందం అంశానికి సంబంధించి ఆధారాలతో సహా పూర్తి వివ‌రాలు ఇచ్చారని వెల్ల‌డించారు. అయినా ప‌నిగ‌ట్టుకుని ఎవ‌రో రాసి ఇస్తే వాటిని ఆధారంగా చేసుకుని విమ‌ర్శ‌లు చేస్తే ఎలా అని మండిప‌డ్డారు ఆర్కే రోజా సెల్వ‌మ‌ణి.

2021లో మే నెల‌లో సెకీ ఎక్క‌డ వేలం వేసింది? 2.14 పైస‌ల‌కు ఎక్క‌డ అమ్మింది? అదానీ వ‌ద్ద గుజ‌రాత్ కరెంటు కొన‌లేదన్నారు. ఆనాడు అదానీతో ఒప్పందం చేసుకుంటామ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం ఏమీ ప‌రుగులు తీయ లేద‌ని పేర్కొన్నారు.