NEWSANDHRA PRADESH

సుప్రీం తీర్పుపై ఆర్కే రోజా స్పంద‌న

Share it with your family & friends

ఇప్ప‌టికైనా చంద్ర‌బాబు మారాలి

అమ‌రావ‌తి – తిరుప‌తి ల‌డ్డు ప్ర‌సాదం త‌యారీకి సంబంధించి సోమ‌వారం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ స్థానం సుప్రీంకోరు. ఇద్దరు ప్ర‌ధాన న్యాయ‌మూర్తులతో కూడిన ధ‌ర్మాస‌నం సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది.

ప్ర‌ధానంగా ఏపీ స‌ర్కార్ పై, ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడును ఏకి పారేసింది ధ‌ర్మాస‌నం. అస‌లు క‌ల్తీ జ‌రిగింద‌ని తెలిసిన‌ప్పుడు బాధ్య‌త క‌లిగిన సీఎం చేయాల్సిన ప‌ని ఏమిటి. . ముందు విచార‌ణ‌కు ఆదేశించాలి. ఆ త‌ర్వాత విచార‌ణ‌కు సంబంధించిన నివేదిక‌ను ఆధారంగా చేసుకుని మాట్లాడాలే త‌ప్పా త‌నంత‌కు తానుగా మీడియా ముందుకు వ‌చ్చి చంద్ర‌బాబు చెప్ప‌డం దారుణ‌మ‌న్నారు.

ఈ సంద‌ర్బంగా కోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించారు ఏపీ మాజీ మంత్రి ఆర్కే రోజా సెల్వ‌మ‌ణి. తిరుమల లడ్డు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోట్లాది హిందువుల మనో భావాలను దెబ్బతీస్తూ వ్యవహరించిన తీరుపై కోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డాన్ని ప్ర‌స్తావించారు.

ఏపీ సీఎం ఏర్పాటు చేసిన సిట్ వ‌ల్ల ఉప‌యోగం లేద‌ని, కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌తో విచార‌ణ చేప‌ట్టాల‌ని రోజా కోరారు. మహా ప్రసాదాన్ని మాటలతో మలినం చేసేందుకు అబద్ధాన్ని నిజం చేయడానికి ఇష్టమొచ్చినట్లు మాట్లాడి దైవ ద్రోహం చేశారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.