నిప్పులు చెరిగిన మాజీ మంత్రి ఆర్కే రోజా
అమరావతి – మాజీ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి నిప్పులు చెరిగారు. టీడీపీ కూటమి సర్కార్ పై భగ్గుమన్నారు. మీ పిచ్చి మీరే భరించు కోవాలని, ఇంకొకరిపై రుద్దాలని ప్రయత్నం చేస్తే ఎలా అని ప్రశ్నించారు. ఇక నుంచి ఎంతో ఓర్పుతో సహిస్తూ వచ్చామని, కానీ ఇక ఉపేక్షించే ప్రసక్తి లేదన్నారు . తప్పు చేస్తే ఎవరినైనా నిలదీస్తామని, కడిగా పారేస్తామన్నారు.
ఇచ్చిన హామల ఊసే ఎత్తడం లేదన్నారు. చంద్రబాబు మోసం చేయడంలో దిట్ట అని, అరచేతిలో స్వర్గాన్ని చూపించేది తనేనని మండిపడ్డారు. కేసులు నమోదు చేసినా, అరెస్ట్ చేసినా, ఒత్తిళ్లకు గురి చేసినా బెదిరే ప్రసక్తి లేదన్నారు ఆర్కే రోజా.
శుక్రవారం మాజీ మంత్రి మీడియాతో మాట్లాడారు. ట్రోల్ చేస్తే భయపడి ఆగిపోతాం అనుకుంటే అది మీ భ్రమ అన్నారు. ఉతికి ఆరేస్తామని హెచ్చరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సర్కార్ ను నిలదీస్తూనే ఉంటామన్నారు. పరిష్కరించడం మీ బాధ్యత అన్నారు. చంద్రబాబు నాయుడుకు ప్రచారంపై ఉన్నంత ఆసక్తి రాష్ట్రంపై లేదన్నారు ఆర్కే రోజా సెల్వమణి. జనం తనను క్షమించరని, ఇప్పటికే ప్రజా వ్యతిరేక ఏర్పడిందన్నారు.