ఆరు కోట్ల ఆంధ్రులకు అవమానం
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి రోజా
అమరావతి – ఏపీ మాజీ మంత్రి, వైసీపీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా సెల్వమణి నిప్పులు చెరిగారు. ఆరుకోట్ల ఆంధ్రులను అవమానించారని ఆరోపించారు. ఎక్స్ వేదికగా స్పందించారు. మన చుట్టూ ఉన్న
తెలంగాణకు అవతరణ దినం ఉందని, కర్ణాటకకు, తమిళనాడుకు, ఒడిశాకు ఆవిర్భావ దినం ఉందన్నారు. కానీ ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరాక సీన్ మారిందన్నారు. నవంబర్ 1న ఏపీ అవతరణ దినోత్సవాన్ని జరపక పోవడం దారుణమన్నారు ఆర్కే రోజా సెల్వమణి.
జిల్లా స్థాయిలో కూడా అవతరణ దినోత్సవరం నిర్వహణ రద్దు చేయడం బాధాకరమని పేర్కొన్నారు. జగనన్న ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు.
ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగాన్ని అవహేళన చేసేలా నిర్ణయించడం దారుణమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నిర్వహించరా..? ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమేనా..? మీరసలు పాలకులేనా…? అంటూ నిలదీశారు ఆర్కే రోజా సెల్వమణి.
ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు అవతరించిందని అడిగితే…భావితరాలకు ఏం సమాధానం చెప్తారు..? చంద్రబాబు నాయుడు అంటూ నిలదీశారు.