నిప్పులు చెరిగిన మంత్రి రోజా
అమరావతి – రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా సెల్వమణి నిప్పులు చెరిగారు. టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడును ఏకి పారేశారు. అబద్దాలు ఆడడంలో బాబును మించిన నాయకుడు ఈ దేశంలో లేరన్నారు.
కుప్పంలో మైనార్టీలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తానంతకు తానుగా భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోలేదని అన్నారు. బీజేపీనే తనతో పొత్తు పెట్టుకోవాలని అనుకుందని, ఆ మేరకు వారే పిలిస్తే తాను వెళ్లాలనని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం జనసేన పార్టీ, బీజేపీతో పొత్తు కుదుర్చానని పేర్కొన్నారు. దీనిపై తీవ్రంగా స్పందించారు ఆర్కే రోజా సెల్వమణి. ఎవరు ఎవరిని దేబరించారో, ఎవరు ఎవరిని కాళ్లు పట్టుకున్నారో ఏపీ ప్రజలకు స్పష్టంగా తెలుసన్నారు. ఎన్ని పార్టీలు రాష్ట్రంలో కలిసినా లేక కూటమిగా ముందుకు వెళ్లినా చివరకు మిగిలేది నిరాశేనని స్పష్టం చేశారు మంత్రి.
ఒక రకంగా చెప్పాలంటే గోబెల్స్ ప్రచారంలో నెంబర్ వన్ నారా ఫ్యామిలీ అంటూ మండిపడ్డారు. ఇకనైనా ఒక్కటైనా నిజం మాట్లాడేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు ఆర్కే రోజా సెల్వమణి.