NEWSANDHRA PRADESH

ఆవేశంగా మాట్లాడితే ఓట్లు ప‌డ‌వు

Share it with your family & friends

ప‌ర్యాట‌క శాఖ మంత్రి ఆర్కే రోజా

అమ‌రావ‌తి – ఏపీ ప‌ర్యాట‌క శాఖ మంత్రి ఆర్కే రోజా సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆమె మ‌రోసారి ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై మండిప‌డ్డారు. సీరియ‌స్ వ్యాఖ్య‌లు చేశారు. గురువారం ఆర్కే రోజా మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్బంగా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేశారు.

ఆవేశంగా , కోపంగా మాట్లాడ‌టం వ‌ల్ల ఓట్లు రాల‌వ‌ని గుర్తు పెట్టుకోవాల‌ని ప‌వ‌న్ పై సెటైర్ వేశారు. చంద్ర‌బాబు , ప‌వ‌న్ క‌లిసి ఎన్ని వ్యూహాలు ప‌న్నినా, ఎన్ని కుట్ర‌లు చేసినా ఒరిగేది ఏమీ ఉండ‌ద‌న్నారు. తాము అమ‌లు చేసిన న‌వ ర‌త్నాలు త‌మ‌ను గ‌ట్టెక్కించేలా చేస్తాయ‌ని అన్నారు.

త‌మ నాయ‌కుడు ద‌మ్మున్నోడ‌ని , ఎవ‌రినో చూసి భ‌య‌ప‌డే ప్ర‌స‌క్తే ఉండ‌ద‌న్నారు మంత్రి ఆర్కే రోజా సెల్వ‌మ‌ణి. తాడేప‌ల్లిగూడెం వేదిక‌గా టీడీపీ, జ‌న‌సేన కూట‌మి సంయుక్తంగా జ‌న విజ‌య కేత‌నం పేరుతో భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించింది. దీనిపై ఆర్కే రోజా స్పందించారు.

ఏ స‌భ పెట్టినా జ‌నం హాజ‌ర‌వుతార‌ని, వాళ్ల‌లో వారికే అవ‌గాహ‌న లేద‌ని , స‌మ‌న్వ‌యం చేసుకోలేని వాళ్లు రాష్ట్రాన్ని ఎలా ఉద్ద‌రిస్తారంటూ ప్ర‌శ్నించారు.