నిప్పులు చెరిగిన ఆర్కే రోజా
చిత్తూరు జిల్లా – టీడీపీ, జనసేన విడుదల చేసిన మేనిఫెస్టోపై సీరియస్ కామెంట్స్ చేశారు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి. విచిత్రం ఏమిటంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోటో లేకుండానే విడుదల చేయడాన్ని తప్పు పట్టారు. తమ మేనిఫెస్టో ముందు కూటమి మేని ఫెస్టో తేలి పోయిందని ఎద్దేవా చేశారు.
2019లో తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలో ప్రకటించిన మేనిఫెస్టోకు సంబంధించి 100 హామీలలో 99 హామీలను నెరవేర్చడం జరిగిందని స్పష్టం చేశారు ఆర్కే రోజా సెల్వమణి. దేశంలో ఎక్కడా లేని రీతిలో సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు .
తమ పార్టీ అధినాయకుడు తీసుకు వచ్చిన వాలంటీర్ వ్యవస్థ దేశానికే ఆదర్శ ప్రాయంగా మారిందన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎంతగా ప్రజలను మభ్య పెట్టాలని చూసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ఇకనైనా మారితే బెటర్ అని సూచించారు ఆర్కే రోజా సెల్వమణి.