నిప్పులు చెరిగిన ఆర్కే రోజా
అమరావతి – మాజీ మంత్రి ఆర్కే రోజా షాకింగ్ కామెంట్స్ చేశారు. తిరుపతి నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో తాము ఓడి పోలేదన్నారు. మేం ఓడినా గెలిచినట్లేనని, వాళ్లు గెలిచినా ఓడి పోయినట్లేనని ఎద్దేవా చేశారు. విధుల నిర్వహణలో మేయర్ శిరీషను కావాలని అవమానించారని ఆరోపించారు. లోపల సమావేశం జరుగుతుంటే బయట ఆమె ఆందోళన చేపట్టిందన్నారు. వ్యవస్థల ఉదాసీనత, అధికార దుర్వినియోగం మాత్రమే గెలిచిందన్నారు.
సమయం వచ్చినప్పుడు ప్రజలు తప్పకుండా సమాధానం చెప్పి తీరుతారన్నారు మాజీ మంత్రి. మంగళవారం ఎన్నిక అనంతరం ఆర్కే రోజా సెల్వమణి మీడియాతో మాట్లాడారు. వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నది ఎవరో జనానికి తెలిసి పోయిందన్నారు.
కేవలం తమను విమర్శించడం తప్పితే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారా అని ప్రశ్నించారు. ఏడు నెలల కాలంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా వ్యతిరేకత పెరిగిందన్నారు. చంద్రబాబు నాయుడు అబద్దాలు చెప్పడంలో నెంబర్ వన్ అని ఎద్దేవా చేశారు ఆర్కే రోజా సెల్వమణి.