జగన్ ను సీఎం చేసేంత దాకా నిద్రపోను
శపథం చేసిన మాజీ మంత్రి ఆర్కే రోజా
అమరావతి – మాజీ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ పుట్టిన రోజు సందర్బంగా కేక్ కట్ చేశారు. జగన్ ను మళ్లీ ఏపీకి సీఎం చేసేంత దాకా తాను నిద్రపోనని ప్రకటించారు. అధికారంలోకి రాక ముందు బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటీ అన్నాడని కానీ ఇప్పుడు సీన్ మారిందన్నారు.
పుణ్య క్షేత్రాల్లో పబ్బులు, బెల్ట్ షాపులు నడుపుతున్నారంటూ ఎద్దేవా చేశారు. జగన్ కట్ అవుట్ కు కూడా సర్కార్ భయపడుతోందన్నారు. మాయ మాటలు చెబుతూ అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందన్నారు.
తమ పార్టీ నుంచి ఎవరు వెళ్లినా తమకు వచ్చే నష్టం ఏమీ లేదన్నారు. ఆనాడు ఒక్కడే ఎదుర్కొన్నాడని, ఇవాళ జగన్ రెడ్డిని తక్కువ అంచనా వేస్తే చివరకు షాక్ కు గురి కాక తప్పదన్నారు ఆర్కే రోజా సెల్వమణి.
తమ పార్టీకి చెందిన నాయకులను, కార్యకర్తలను బెదిరించినా , వారి ఆస్తులు ధ్వంసం చేసినా ఎవరిని వదిలి పెట్టే ప్రసక్తి లేదన్నారు. రాబోయేది తమ ప్రభుత్వమేనని ప్రకటించారు . ప్రతి ఒక్కడికీ వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు.