NEWSANDHRA PRADESH

వైఎస్ఆర్ జీవితం స్పూర్తి దాయ‌కం

Share it with your family & friends

పేదల కోసం పుట్టిన నేత‌ వైఎస్సార్‌

చిత్తూరు జిల్లా – పేద‌ల కోసం పుట్టిన మ‌హా నాయ‌కుడు దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి అన్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా సెల్వ‌మ‌ణి. సోమ‌వారం వైఎస్సార్ 75వ జ‌యంతిని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా వైఎస్సార్ విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు ఆర్కే రోజా సెల్వ‌మ‌ణి.

త‌న జీవితాంతం పేద‌ల‌కు మేలు చేయాల‌న్న త‌ప‌నను క‌లిగి ఉన్నార‌ని , అలాంటి నాయ‌కుడు ఇక పుట్ట‌రంటూ పేర్కొన్నారు. కేక్‌లు కట్‌చేసి పార్టీ శ్రేణులకు పంచారు. ఏరియా ఆస్పత్రిలో ప్రతి వార్డులోని పేషంట్లకు బ్రెడ్డు, పండ్లు పంపిణీ చేశారు.

పేద ప్రజల కోసం నిరంతరం శ్రమించిన నేత వైఎస్సార్‌ అన్నారు. 108, ఆరోగ్యశ్రీ అంటూ ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. వైఎస్సార్‌ భౌతికంగా దూరమై 14 యేళ్లు దాటినా ప్రజల మనసుల్లో చిరంజీవిగా ఉన్నారన్నారు.

ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ మార్గదర్శకం అన్నారు. వ్యవసాయ రంగంలో విప్లవం తెచ్చి రైతుకు ఊపిరి పోసిన నాయకుడు వైఎస్సార్ అని కొనియాడారు ఆర్కే రోజా పెల్వ‌మ‌ణి.