అరుణాచలేశ్వరుని సన్నిధిలో రోజా
గిరి ప్రదక్షిణ చేసిన పర్యాటక మంత్రి
తమిళనాడు – రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన తమిళనాడు లోని శ్రీ అరుణాచలం ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా భక్తులతో కలిసి గిరి ప్రదక్షిణ చేశారు. మంత్రి రోజాకు ఆలయ కమిటీ పాలక మండలి సభ్యులతో పాటు పూజారులు సాదర స్వాగతం పలికారు.
స్వామి వారిని దర్శించుకున్న అనంతరం భక్తులకు పండ్లు పంపిణీ చేశారు. స్వామి వారి సేవలో పాల్గొనడం పూర్వ జన్మ సుకృతమని పేర్కొన్నారు ఆర్కే రోజా సెల్వమణి. అరుణాచలేశ్వరుడి కృప ఏపీ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నానని తెలిపారు.
పేదలకు ప్రేమతో సేవ చేసే వారికెప్పుడూ భగవంతుడు తోడుగా ఉంటాడని అన్నారు. స్వామి వారి ఆశీస్సులతో జగనన్న మళ్లీ సీఎం కావాలని కోరుకున్నట్లు చెప్పారు ఆర్కే రోజా సెల్వమణి. తాను మూడోసారి గెలుస్తానని, హ్యాట్రిక్ సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
నాలుగేళ్ళుగా నగరిలో నాపై కోవర్టులతో కలిసి కుట్రలు చేశార ని, దుష్ప్రచారం చేశారని వాపోయారు.. కానీ అభివృద్దే లక్ష్యంగా పని చేశానని చెప్పారు.