ఖాదర్ వలి దర్గాలో రోజా పూజలు
మాజీ మంత్రి మొక్కుబడులు
అమరావతి – మాజీ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి పుత్తూరులో నాగూరు ఖాదర్ వలి గంధపు మహోత్సవంలో పాల్గొన్నారు. ముస్లిం నాయకులు, భక్తులు గజమాలతో స్వాగతం పలికారు. ప్రతి ఏటా దర్గాలో ఇస్లాం సాంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
కోరిన కోర్కెలు తీరుతాయని ఆర్కే రోజా సెల్వమణి మొక్కుబడులు చెల్లిస్తూ వస్తున్నారు. ఈసారి కూడా గంధపు ఉత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి. తమ ప్రభుత్వ హయాంలో నాగూరు ఖాదర్ వలి దర్గా అభివృద్దికి కృషి చేయడం జరిగిందని చెప్పారు.
ఈసారి కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించిన దర్గా కమిటీ నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు ఆర్కే రోజా సెల్వమణి. ఈ కార్యక్రమమంలో మాజీ మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ మహీన్, మున్సిపల్ చైర్మన్ హరి, వైస్ చైర్మన్ శంకర్, జయప్రకాశ్, మసీదు పెద్దలు సాహిబ్ ఇలియాస్ యూసఫ్ సాహీబ్ ఖాదర్ సాహెబ్, ముస్లిం సోదరులు, మునిసిపల్ వైస్సార్సీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.