పవన్ కళ్యాణ్ పై ఆర్కే రోజా కామెంట్స్
వ్యక్తిగత విమర్శలు చేస్తే మౌనమేల
అమరావతి – ఏపీ మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా సెల్వమణి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పై నిప్పులు చెరిగారు. ఆయన చెప్పేది ఒకటి చేసేది మరొకటి అని మండిపడ్డారు. ఏ ఒక్క మాట మీద నిలబడడని, ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఎవరికీ తెలియదన్నారు.
తన వద్ద ఎన్నో శాఖలు ఉన్నాయని, ఇంకా హోం శాఖ కావాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు. ముందు నీకు ఉన్న శాఖలలో నీకు పట్టుందా అన్నది తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు ఆర్కే రోజా సెల్వమణి. ఆడపిల్లలు, మహిళలకు రక్షణ కల్పించలేని స్థితిలో ఏపీ సర్కార్ ఉండడం దారుణమన్నారు.
100 రోజుల ఏపీ కూటమి పాలనలో ఏకంగా 100 అత్యాచారాలు చోటు చేసుకున్నాయని, రోజూ ఏదో ఒక చోట ఘటన చోటు చేసుకుంటోందని, ఏపీ మరో బీహార్ లాగా మారి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఆర్కే రోజా సెల్వమణి.
ఇదే సమయంలో ఆమె పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మండిపడ్డారు. తనను , తన కూతురిని టార్గెట్ చేస్తూ వ్యక్తిగత విమర్శలు చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.