వైఎస్సార్ ఆస్తులు ఎప్పుడో పంచారు
తిరుమల – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి చేసిన కామెంట్స్ పై పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి సీరియస్ అయ్యారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎప్పుడో ఆస్తులు పంచారని పేర్కొన్నారు. పార్టీ చీఫ్ షర్మిలా రెడ్డికి ఎలాంటి రాజకీయ అవగాహన లేదని ధ్వజమెత్తారు.
వైఎస్ఆర్ ముందు చూపుతో ఎప్పుడో జగన్, షర్మిళకు ఆస్తులు పంచారని ఈ విషయం తెలియకుండా కామెంట్స్ చేయడం మంచి పద్దతి కాదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలో వున్నప్పుడు భర్తీ చెయ్యని డీఎస్సీ పోస్టులను జగన్ భర్తీ చేశారన్నారు.
6100 పోస్టుల భర్తీకీ ప్రస్తుతం జగన్ నోటిఫికేషన్ ఇచ్చారని చెప్పారు. తెలంగాణ బిడ్డని, అక్కడి ప్రజలకు అండగా ఉంటానని, నాలుగున్నరేళ్ల తరువాత షర్మిళ ఏపీకీ వచ్చి నానా యాగి చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ పై షర్మిళ విషం చిమ్ముతున్నారని ఆరోపించారు.
చంద్రబాబు, కాంగ్రెస్ ఆడుతున్న నాటకంలో షర్మిళని పావుగా వాడుతున్నారని ఫైర్ అయ్యారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ఆస్థిలో అన్నాచెల్లెలు, భార్యలకు ఎంత పంచాడో చెప్పాలని డిమాండ్ చేశారు ఆర్కే రోజా సెల్వమణి.