రచనా చౌదరి వైరల్
ప్రధాని మోదీతో ఇంటర్వ్యూ
హైదరాబాద్ – ఎవరీ రచనా చౌదరి అనుకుంటున్నారా . తెలంగాణలో పేరొందిన న్యూస్ , భక్తి ఛానల్ ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి కూతురే ఈమె. ప్రస్తుతం ఆమె మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చారు. దీనికి కారణం ఏమిటంటే తెలుగు ఛానళ్లు వరుస బెట్టి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఇంటర్వ్యూ చేసేందుకు పోటీ పడ్డాయి.
తాజాగా ఆ ఛానల్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రాజశేఖర్ తో పాటు ఎండీగా ఉన్న రచనా చౌదరి పీఎంను పలు ప్రశ్నలు అడిగారు. దీంతో ఆమె అడిగిన విధానం, ప్రధాని చెప్పిన సమాధానాలతో కూడిన వీడియో వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో హల్ చల్ అవుతోంది.
నెటిజన్లు ఎవరీ రచనా చౌదరి అని వెదకటం మొదలు పెట్టారు. మిగతా వారికంటే భిన్నంగా ఆలోచించడం, కొత్తదనం ఉండేలా చూడటం రచనా చౌదరికి ఇష్టం. ఇదే సమయంలో దేశంలోనే అత్యున్నతమైన పదవి లో కొలువు తీరిన నరేంద్ర మోదీని ఇంటర్వ్యూ చేసేందుకు ఛాన్స్ దక్కడం మామూలు విషయం కాదు . ఈ సందర్బంగా మోదీకి ధన్యవాదాలు తెలిపారు రచనా చౌదరి.