పోటీ చేయడం ముఖ్యం కాదు
దేశానికి లౌకిక వాదం అవసరం
ఉత్తరప్రదేశ్ – కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు , ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రియాశీల రాజకీయాల్లో తన పాత్ర గురించి మీడియాతో పంచుకున్నారు. పోటీ చేయడం అన్నది ముఖ్యం కాదని అన్నారు రాబర్ట్ వాద్రా. పార్టీ తనపై నమ్మకం ఉంచితే , అవకాశం కల్పిస్తే పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించారు.
అయితే తనను ఉంచాలా లేదా అన్నది పార్టీ హై కమాండ్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు రాబర్ట్ వాద్రా. ఒకవేళ సమ్మతి ఇస్తే తాను పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు. తాను అమేథీ నుండి పోటీ చేయాల్సిన అవసరం లేదన్నారు.
మొరాదాబాద్ , హర్యానా నుంచి కూడా పోటీ చేయొచ్చని చెప్పారు . ప్రధానంగా దేశంలో అన్ని వర్గాల ప్రజలు బతికే పరిస్థితిలో ఉండాలని తాను అనుకుంటానని అన్నారు. సెక్యూలర్ గా ఉంటూ మత రాజకీయాలకు దూరంగా ఉంటే బావుంటుందన్నారు. ప్రధాని మోదీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించు కోవాలని సూచించారు.
మనం పురోగతి వైపు ఎలా పయనించాలో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. తన కుటుంబం ఎప్పుడూ అంతా బావుండాలని కోరుకుంటుందన్నారు. ఒకవేళ ప్రజలు తనను పాలిటిక్స్ లోకి రావాలని అనుకుంటే వస్తానని అన్నారు రాబర్ట్ వాద్రా.