గాంధీ కుటుంబం ఎంతో చేసింది
ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా
న్యూఢిల్లీ – సోనియా గాంధీ అల్లుడు, ప్రముఖ వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉత్తర ప్రదేశ్ లోని అమేథి లోక్ సభ నియోజకవర్గంపై ఆయన స్పందించారు. తనను పార్లమెంట్ సభ్యుడిగా నిర్ణయించుకుంటే ఆశించిన దానికంటే ఎక్కువగా ప్రజా సేవకుడిగా కొనసాగుతానని స్పష్టం చేశారు.
గాంధీ కుటుంబం కొన్నేళ్లుగా రాయ్ బరేలీ, అమేథీలో కష్టపడి కొన్నేళ్లుగా పని చేసిందని చెప్పారు రాబర్ట్ వాద్రా. సుల్తాన్ పూర్ నియోజకవర్గంలో ఉన్న ప్రజా ప్రతినిధి వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఆమెను ఎన్నుకోవడం చాలా తప్పు చేశామని బాధ పడుతున్నారని తెలిపారు.
ప్రస్తుతం దేశంలో ఇండియా కూటమి గాలి వీస్తోందని స్పష్టం చేశారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అది త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో స్పష్టం అవుతుందని పేర్కొన్నారు రాబర్ట్ వాద్రా. ఎవరు ప్రజా సేవకులో ఎవరు డబ్బున్న వ్యాపారవేత్తలకు వత్తాసు పలుకుతున్నారో తేలి పోతుందన్నారు. పార్టీ నుంచి ఎవరు వెళ్లినా పార్టీకి ఏమీ కాదన్నారు.