ఎన్సీపీ ఎప్పీ మహిళా విభాగం చీఫ్
ఎన్సీపీ శరద్ పవార్ పార్టీ మహిళా విభాగం ప్రెసిడెంట్ రోహిణి ఖడ్సే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి శిక్ష లేకుండా మహిళలకు చంపేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు మహిళా దినోత్సవం సందర్బంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సమయంలో మర్డర్ చేసుకునే మహత్ భాగ్యాన్ని కల్పించాలని కోరారు. స్త్రీలందరి తరపున ఒకటే డిమాండ్ చేస్తున్నామని, కనీసం ఒకే ఒక్కరినైనా చంపేందుకు ఛాన్స్ ఇవ్వాలన్నారు. మహిళలపై రోజు రోజుకు నేరాలు ఎక్కువవుతున్న నేపథ్యంలో పై వెసులుబాటు కల్పించాలని లేఖ రాయడం విశేషం.
ఈ సందర్బంగా రోహిణి ఖడ్సే చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఆమెకు సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున మద్దతు పలుకుతూ కామెంట్స్ పెడుతున్నారు. తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. భారత రాజ్యాంగం , తయరు చేసిన చట్టం మర్డర్ చేసేందుకు ఒప్పుకోదని కానీ ప్రస్తుతం సమాజంలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయంటూ పేర్కొంటున్నారు. వంద మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదనేది భారత చట్టం స్పష్టం చేస్తుంది. మొత్తంగా దేశ వ్యాప్తంగా రోహిణి ఖడ్సే సంచలనంగా మారారు. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు.