టి20 క్రికెట్ కు రోహిత్ శర్మ గుడ్ బై
సంచలన ప్రకటన చేసిన కెప్టెన్
బ్రిడ్జ్ టౌన్ – వెస్టిండీస్ వేదికగా జరిగిన ఐసీసీ టి20 వరల్డ్ కప్ ఫైనల్ లో బలమైన ద్‌క్షిణాఫ్రికా జట్టును ఓడించి విశ్వ విజేతగా నిలిచింది భారత క్రికెట్ జట్టు. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా సమిష్టి కృషితో రాణించింది. అందరినీ విస్తు పోయేలా చేసింది. 143 కోట్ల మంది భారతీయులు గర్వ పడేలా , సగర్వంగా తల ఎత్తుకునేలా ఆడింది. తనకు ఎదురే లేదని చాటింది.
తన కెరీర్ లో టి20 వరల్డ్ కప్ ను సాధించడంతో తెగ సంతోషానికి లోనయ్యాడు కెప్టెన్ రోహిత్ శర్మ. ఇదే సమయంలో సంచలన ప్రకటన చేశాడు. ఇక తాను టి20 ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. కోట్లాది మంది క్రికెట్ అభిమానులకు బిగ్ షాక్ ఇచ్చాడు.
తనకు ఓ కల అంటూ ఉండేదని, అది నెరవేరిందని, ఎవరూ చెప్పక ముందే తాను గౌరవ ప్రదంగా ఉండేలా టి20 ఫార్మాట్ కు గుడ్ బై చెబుతున్నట్టు తెలిపాడు రోహిత్ శర్మ. మొత్తం తన మొత్తం కెరీర్ లో 159 మ్యాచ్ లు ఆడాడు. 4, 231 పరుగులు చేశాడు. 2007లో టి20 వరల్డ్ కప్ లో ఎంట్రీ ఇచ్చాడు.