టెస్ట్ సీరీస్ పై ఫోకస్ పెట్టాం – రోహిత్ శర్మ
న్యూజిలాండ్ ను వైట్ వాష్ చేస్తాం
ముంబై – భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ తో జరిగిన టెస్ట్ సీరీస్, టి20 సీరీస్ పూర్తయింది. రెండింటిలోనూ టీమిండియా అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించిందని అన్నాడు. రెండు ఫార్మాట్ లలో సీరీస్ గెల్చు కోవడం జరిగిందన్నాడు. అయితే ప్రస్తుతం న్యూజిలాండ్ తో భారత్ టెస్ట్ సీరీస్ ఆడాల్సి ఉందన్నాడు.
ఈ సందర్బంగా కెప్టెన్ రోహిత్ శర్మ మంగళవారం సీరీస్ సందర్బంగా మీడియాతో మాట్లాడారు. తాము పూర్తి ఫిట్ నెస్ తో ఉన్నామని, ఏ జట్టుతోనైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశాడు. అయితే న్యూజిలాండ్ ను వైట్ వాష్ చేయాలన్నది తమ కల అని , దాని పైనే ఎక్కువగా దృష్టి సారించామని చెప్పాడు రోహిత్ శర్మ.
అయితే న్యూజిలాండ్ జట్టును తక్కువగా అంచనా వేసేందుకు వీలు లేదన్నాడు. ఆ జట్టు కూడా అన్ని విభాగాలలో బలంగా ఉందన్నాడు భారత జట్టు స్కిప్పర్. ఏది ఏమైనా తమ ఆటగాళ్లు కీవీస్ తో తాడో పేడో తేల్చుకునేందుకు ఫుల్ గా ప్రాక్టీస్ చేస్తున్నారని చెప్పాడు.